శంషాబాద్లో రణరంగం - బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతుల నిరాకరణ, పోలీసులపై కారం పొడితో దాడి..!
భారతదేశం, జూలై 18 -- నగర శివార్లలోని శంషాబాద్ పరిధిలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైడ్రా, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా చేపట్టిన 650 ఎకరాల భూమి ఫెన్సింగ్ (కంచె వేసే) కార్యక్రమం రణరంగాన్ని తలపించింది. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ స్థానిక రైతులు, మహిళలు మరియు రాజకీయ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ క్రమంలో నిరసనకారులు హద్దులు దాటి పోలీసులపై రాళ్లు, మిర్చి పొడితో దాడికి తెగబడ్డారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
శనివారం ఉదయం నుంచే కంచె వేస్తున్న అధికారులను నిరసనకారులు అడ్డుకున్నారు. భద్రతా సిబ్బందితో నిరసనకారులు తీవ్ర ఘర్షణకు దిగారు. ఈ తోపులాటలో ఒక రైతు స్పృహతప్పి పడిపోవడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఆగ్రహించిన నిరసనకారులు, ముఖ్యంగా మహిళా నిరసనకారులు పోలీసులపైకి మిర్చి పొడి, రాళ్లు విసిరారు.
ఈ దాడిలో చేవెళ్ల డీసీపీ యో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.