భారతదేశం, ఫిబ్రవరి 28 -- కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అంతకంటే ముందు ప్రమాదం జరిగిన స్థలాన్ని కూడా పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు.
జీజీహెచ్ లో బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు . ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
"జరిగిన విషాదం మరచిపోలేనిది.. కలిగిన నష్టం భర్తీ చేయలేనిది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించాను. ఈ కష్ట సమయంలో వారితో ఉండటం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.