భారతదేశం, మార్చి 5 -- సాధారణంగా రాజ్యసభ సీట్లంటే సామాజిక సమీకరణాలు, సీనియారిటీ లేదా ఢిల్లీ పెద్దల కోటాకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ, తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ముద్రను స్పష్టంగా చూపించారు. తన అత్యంత సన్నిహితుడు, రాజకీయ ప్రయాణంలో కష్టసుఖాలను పంచుకున్న వేం నరేందర్ రెడ్డిని పెద్దల సభకు పంపడం ద్వారా రేవంత్ రెడ్డి అధిష్ఠానం వద్ద తనకున్న పట్టును మరోసారి నిరూపించుకున్నారు.

ముఖ్యమంత్రికి రాష్ట్రంలో పాలనాపరమైన ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. తరచూ ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానంతో లేదా కేంద్ర ప్రభుత్వంతో లాబీయింగ్ చేయడం ఎల్లప్పుడూ సాధ్యపడదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఎలాగైతే ఉండేవారో, ఇప్పుడు రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి అలా మారబోతున్నారు.

లక్ష్యం: ఏఐసీసీ వర్గాలతో నిత్యం సమన్వయం చేసుకోవడం, రాష్ట్ర రాజకీయ పరిణామా...