భారతదేశం, సెప్టెంబర్ 17 -- ఆంధ్రప్రదేశ్‌లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్(Veterinary Assistant Surgeon) ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు కొనసాగుతున్న పాత విధానానికి స్వస్తి పలికింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో ఉన్న నిబంధనల ప్రకారం అకడమిక్ మార్కులు, ఉన్నత విద్య, సర్వీస్ అనుభవం, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉన్న సీనియారిటీ ఆధారంగా (వెయిటేజ్ పద్ధతిలో) ఎంపిక చేపట్టాలని ఈ నెల 13, 14 తేదీల్లో ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, తాజాగా ఆ ఉత్తర్వులను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. మెరిట్ ఆధ...