భారతదేశం, జూలై 19 -- Venkatramaiah Gari Taluka Review In Telugu And Rating: కుటుంబ విలువలు, రూటెడ్ విలేజ్ సెంటిమెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన న్యూ తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రమే 'వెంకట్రామయ్య గారి తాలూకా'. గతంలో 'బలగం' వంటి చిత్రాలను ఆదరించిన తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ, పల్లెటూరి నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ కథను దర్శకుడు సతీష్ ఆవాల ఎంచుకున్నారు.

బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా ఈ సినిమాతో పరిచయం అయింది. ఇందులో దినేష్ కుమార్ హీరోగా చేశాడు. ట్రైలర్, టీజర్, సాంగ్స్‌తో మెప్పించిన ఈ సినిమా జూలై 17న థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ మూవీ ఎంతమేర ఆకట్టుకుందో నేటి వెంకట్రామయ్య గారి తాలూకా రివ్యూలో తెలుసుకుందాం.

పిల్లలే తన సర్వస్వంగా భావించే ఒక సాదాసీదా మధ్యతరగతి తండ్రి వెంకట్రామయ్య (మురళీధర్ గౌడ్) ...