వీసీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు!
భారతదేశం, నవంబర్ 9 -- హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU)లో తీవ్ర కలకలం రేగింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్డాస్ జానయ్యపై ఒక మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ తీవ్రస్థాయిలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
పీజేటీఏయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముసిని తేజశ్రీ ఆరోపణలు చేశారు. వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య తనను లైంగికంగా వేధించడంతో పాటు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు నవంబర్ 7న ఆమె మహిళా కమిషన్‌కు అధికారికంగా పిటిషన్ సమర్పించారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్, విచారణ నిమిత్తం వర్సిటీ వీసీకి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 12న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.