భారతదేశం, జూలై 9 -- CM Revanth Reddy Grandson Video : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటేనే ఎప్పుడూ ఫైర్ బ్రాండ్ రాజకీయాలు, ప్రత్యర్థులపై తూటాల్లాంటి విమర్శలు, సమకాలీన అంశాలపై వేసే చమత్కారాలు, ఛలోక్తులు గుర్తుకు వస్తాయి. నిత్యం అధికారులతో సమీక్షలు, పార్టీ నాయకులతో రాజకీయ వ్యూహాలు, ప్రజా సమస్యల పరిష్కారాల కోసం నిరంతర అపాయింట్‌మెంట్లతో ఆయన షెడ్యూల్ ఎంతో బిజీబిజీగా సాగుతుంటుంది.

వీలైనప్పుడు పుట్ బాల్ గేమ్ ఆడుతూ కనిపించే సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి వంటింట్లో గంటె పట్టారు. ఏకంగా వంటగదిలో ప్రత్యక్షమై వేడివేడి పూరీలు చేశారు. తన మనవడు రేయాన్ష్‌తో కలిసి సరదాగా గడిపిన కొన్ని మధుర క్షణాల వీడియోను రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్) లో పంచుకున్నారు.

రేయాన్ష్ కోసం ఆయనే స్వయంగా పిండి కలిపి, పూరీలు తయారు చేసి, వేడి వేడి నూనెలో వేయించి వడ్డించా...