భారతదేశం, జూలై 8 -- "రైతే రాజు"... "మాది రైతు ప్రభుత్వం"... "రైతుల కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం"... "ఏ రైతునూ నష్టపోనివ్వం"... ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రభుత్వం రైతుల మీద ప్రేమ చూపిస్తూ చెప్పే మాటలు ఇవే. కానీ ఈ మాటలు ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తున్నాయో తెలుసుకోవాలంటే రైతులను అడిగితే అవగతమవుతుంది. రైతులపై ప్రభుత్వాలు,రాజకీయ పార్టీల హామీలు, మాటలు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా మెజారిటీ రైతుల స్పందన ఒక్కటే... నినాదాలు గొప్పగా ఉన్నాయి, కానీ రైతు జీవితంలో మార్పు మాత్రం కనిపించడం లేదనే అసంతృప్తి ప్రతి చోటా కనిపిస్తుంది.

వ్యవసాయం కేవలం ఒక వృత్తి కాదు. అది దేశ ఆహార భద్రతకు వెన్నెముక. అయినప్పటికీ, పంటను దుక్కి దున్నడం నుంచి పంటను మార్కెట్‌లో అమ్ముకొని, బ్యాంకులో పడిన నగదును తీసుకునేంతవరకూ అడుగడుగునా రైతు ఎదుర్కొనే కష...