భారతదేశం, జూలై 20 -- ఒక దేశపు భవిష్యత్తు ఎక్కడ రూపుదిద్దుకుంటుంది..? అసెంబ్లీ హాల్స్‌లోనో, సచివాలయాల ఫైళ్లలోనో కాదు... నిశ్శబ్దంగా, అత్యంత శక్తివంతంగా తరగతి గదుల్లో...అక్షరాల్లో రూపుదిద్దుకుంటుంది. అక్షరం ఒక మనిషి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఆయుధం. సమాజంలో అణచివేతకు, తరతరాల పేదరికానికి వ్యతిరేకంగా పోరాడగలిగే ఏకైక శక్తీ అక్షరమే. అందుకే, నవ్యాంధ్రప్రదేశ్‌ను కేవలం భౌతిక అభివృద్ధిలోనే కాదు, విద్యా ప్రగతిలోనూ అగ్రస్థానంలో నిలపాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఈ సుదీర్ఘ అక్షర యజ్ఞంలో... పేద తల్లుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిన చారిత్రాత్మక విప్లవం "తల్లికి వందనం" పథకం గురించి ఈ సందర్భంగా మాట్లాడుకోవడం సముచితం.

పిల్లల చదువులకి పేదరికం అడ్డు కాకూడదనేది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి బలమైన సంకల్పం. తన పిల్లల చదువుకోసం ఒక పేద తల్లి పడే కష్టం మాటల...