భారతదేశం, నవంబర్ 12 -- సీఐఐ 31వ భాగస్వామ్య సదస్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. 30 ఎంఓయులు, 5 జీఓల ద్వారా రూ. 1,57,607 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని యువతకు 52,956 ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

రెన్యువబుల్ ఎనర్జీ, ఇన్‌ఫ్రా, ఏరో స్పేస్, హెల్త్ కేర్, టూరిజం రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ 3 ఎంఓయుల ద్వారా రూ.39,400 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా 12,940 ఉద్యోగావకాశాలు రానున్నాయి. రష్మీ మెటలర్జికల్ ఇండస్ట్రీస్ ప్రైవేట...