భారతదేశం, అక్టోబర్ 7 -- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి రెండు రోజుల పాటు దేశ రాజధాని న్యూఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల ఆమోదం, ఆర్థిక నిధుల సమీకరణ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు.

రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయడం, కరవు పరిస్థితుల నుంచి ఉపశమనం పొందడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టుతో పాటు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన విశాఖపట్నం బీచ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం కోరనున్నారు.

ఎల్ నీనో ప్రభావం వల్ల రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు, రైతులకు సాయం అందించేందుకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ లేద...