విశాఖ తీరంలో ప్రమాదం - వేటకెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తా, ఆరుగురు గల్లంతు!
భారతదేశం, జూలై 5 -- నైరుతి రుతుపవనాల రాకతో సముద్రంలో ఏర్పడిన అల్లకల్లోల వాతావరణం, బలమైన ఈదురుగాలుల కారణంగా విశాఖపట్నం తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్యకారులతో కూడిన బోటు బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతు కాగా.. మరో వ్యక్తిని కాపాడారు.
విశాఖపట్నం ఫిషింగ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు తెలిపిన వివరాల ప్రకారం... జూలై 1వ తేదీన ఈ ఏడుగురు మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం వారు జూలై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకల్లా తిరిగి తీరానికి చేరుకోవాల్సి ఉంది. ఈ మేరకు వారు తమ కుటుంబ సభ్యులకు కూడా ముందుగా సమాచారం అందించారు.
శనివారం (జూలై 4) మధ్యాహ్నం దాటినా మత్స్యకారులు తిరిగి రాకపోవడం, వారి మొబైల్ ఫోన్లు అన్నీ స్విచ్ఛాప్ రావడంతో ఆందోళన చెం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.