భారతదేశం, ఆగస్టు 7 -- వరల్డ్ ఎలిఫెంట్ డే(ఆగస్టు 12) పురస్కరించుకుని విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆదివారం (ఆగస్టు 9, 2026) రోజున విద్యార్థుల కోసం చిత్రలేఖనం (డ్రాయింగ్) పోటీలను నిర్వహించనున్నట్లు జూ అధికారులు వెల్లడించారు.

జూపార్క్‌ ప్రాంగణంలోని జూ బయోస్కోప్ వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పోటీలు జరగనున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ, ఏనుగుల విశిష్టతపై అవగాహన పెంచేందుకు ఈ పోటీలను మొత్తం మూడు విభాగాలుగా వర్గీకరించారు.

విభాగం-1 (1 నుంచి 5వ తరగతి విద్యార్థులు) 'నా ఏనుగు - దాని సంరక్షకుడు' (My Elephant and Its Keeper)

విభాగం-2 (6 నుంచి 10వ తరగతి విద్యార్థులు) 'ఏనుగు: ఇండియా నేషనల్ హెరిటేజ్ ఎనిమల్ - వన్యప్రాణుల రక్షణ, వారసత్వ పరిరక్షణ'

విభాగం-3 (ఇంటర్మీడియట్...