భారతదేశం, జూన్ 23 -- నమ్ముకున్న భర్త, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు, పచ్చని సంసారం.. వీటన్నింటికంటే ఓ పరాయి వ్యక్తితో ఏర్పడిన వివాహేతర బంధమే ఎక్కువనుకుంది ఓ మహిళ. క్షణిక సుఖాల కోసం కట్టుకున్నవాడిని కడతేర్చడమే కాకుండా, ఆ పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆత్మహత్యగా నాటకమాడింది. కానీ చట్టం ముందు ఆమె నాటకాలు సాగలేదు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన బోడ నర్సింగ్ (36), స్వరూప దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన ఈ కుటుంబం.. ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో నివాసం ఉంటోంది. నర్సింగ్ కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణ...