భారతదేశం, మార్చి 27 -- సహజీవనం (Live-in relationship) విషయంలో అలహాబాద్ హైకోర్టు శుక్రవారం (మార్చి 27) ఒక చారిత్రాత్మక పరిశీలన చేసింది. పెళ్లయిన ఒక పురుషుడు మరొక వయోజన మహిళతో పరస్పర అంగీకారంతో కలిసి ఉండటం చట్టరీత్యా నేరం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. పౌరుల హక్కులను కాపాడటమే కోర్టు ప్రథమ కర్తవ్యమని, సామాజిక నైతికత అనేది చట్టం కంటే మిన్న కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఒక జంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. సదరు యువతి కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, 'పరువు హత్య' (Honour Killing)కు పాల్పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తాము మేజర్లమని, స్వచ్ఛందంగా కలిసి ఉంటున్నామని ఆ యువతి ఇప్పటికే జిల్లా ఎస్పీకి విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో వారు కోర్టు గడప తొక్కారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.