భారతదేశం, ఏప్రిల్ 1 -- విమానాల్లో ప్రయాణించే వారికి దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన 'ఇండిగో' గట్టి షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరల భారాన్ని ప్రయాణికులపై మోపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్లపై సవరించిన ఇంధన రుసుములను (ఫ్యూయల్ ఛార్జీలు) వసూలు చేయనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ పెంపు వల్ల సాధారణ ప్రయాణికులతో పాటు వ్యాపారవేత్తలపై కూడా అదనపు భారం పడనుంది.
సవరించిన ధరల ప్రకారం, ప్రయాణించే దూరాన్ని బట్టి ఈ అదనపు ఛార్జీలు రూ. 275 నుండి ఏకంగా రూ. 10,000 వరకు ఉంటాయి. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 2వ తేదీ అర్ధరాత్రి 12:01 గంటల నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ స్పష్టం చేసింది.
విమాన ఇంధన ధరలను సవరించిన రోజే ఇండిగో ఈ ప్రకటన చేసింది. దేశీయ విమాన సర్వీసుల కోసం ఇంధన ధరలను కేవలం 25 శాతం మేరక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.