భారతదేశం, మార్చి 24 -- విద్యుత్ కొనుగోలు ఛార్జీలను తగ్గించే అంశంపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇప్పటికే ఈ దిశగా చేపడుతున్న చర్యలను మరింత ముమ్మరం చేయాలన్నారు. ప్రభుత్వం చేపట్టే విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.4కు తగ్గించటంతో పాటు ప్రజలపై భారం వేయకుండా విద్యుత్ సంస్థల రుణాలు తీర్చేందుకు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. సచివాలయంలో జరిగిన విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం కీలక సూచనలు చేశారు.

2028-29 నాటికి విద్యుత్ కొనుగోళ్ల ఖర్చును తగ్గించేందుకు చేపట్టిన ప్రణాళికలను విద్యుత్ శాఖ అధికారులు సీఎం చంద్రబాబు ముందుంచారు. విద్యుత్ రంగంలోని వివిధ విభాగాల ద్వారా సంస్కరణలు చేపడితే మొత్తంగా యూనిట్ కు రూ.1.32 చొప్పున విద్యుత్ కొనుగోలు భారాన్ని తగ్గించవచ్చని ముఖ్యమంత్రికి వివరించారు. 2028-29 నాటికి యూన...