విద్యార్థులను బెదిరిస్తారా?: డీయూ అడ్వైజరీపై రాహుల్ గాంధీ మండిపాటు
భారతదేశం, జూలై 24 -- ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనల వేళ జంతర్ మంతర్ వద్ద ఎలాంటి నిరసనల్లో పాల్గొనవద్దంటూ ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ), జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) జారీ చేసిన మార్గదర్శకాలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. విద్యార్థులు, అధ్యాపకులు చట్టవిరుద్ధమైన ప్రదర్శనలకు దూరంగా ఉండాలని, నిబంధనలు మీరితే చట్టపరమైన, క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించడంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. విశ్వవిద్యాలయ యాజమాన్యం విద్యార్థుల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు.
"ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకునే విద్యార్థులను బెదిరించడానికి మీకు ఎంత ధైర్యం? సరైన సమయం వచ్చినప్పుడు దీనికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.