భారతదేశం, జూన్ 16 -- రాబోయే జూన్ 21న దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET 2026) జరగనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, సకాలంలో తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. పరీక్షకు వెళ్లే అభ్యర్థులు కండక్టర్‌కు తమ నీట్ హాల్ టికెట్ (NEET Hall Ticket) చూపిస్తే చాలు, రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు.

విద్యార్థుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాలు ఉన్న ప్రధాన నగరాలు, పట్టణాలకు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక బస్సులను అందుబాటు...