భారతదేశం, ఆగస్టు 24 -- తెలంగాణ రాష్ట్రంలోని 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక ప్రకటన విడుదల చేసింది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMSS) పరీక్ష 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ, పరీక్ష రుసుము చెల్లింపు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె. లింగయ్య విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి, పరీక్ష రుసుము చెల్లించడానికి సెప్టెంబర్ 01, 2026 వరకు గడువు పొడిగించారు. ప్రభుత్వ, జెడ్పీ, పురపాలక, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు నెలకు రూ.1,000 చొప్పున (ఏడ...