భారతదేశం, జూన్ 4 -- బెంగుళూరులోని లోక్ భవన్‌లో కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది గంటల్లోనే డీకే శివకుమార్ పాలనలో వేగం పెంచారు. నూతన మంత్రివర్గంతో కలిసి నిర్వహించిన తొలి క్యాబినెట్ సమావేశంలోనే యువత, విద్యార్థులు, రైతులు, నగర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని పెద్దపీట వేశారు. పలు కీలక సంక్షేమ పథకాలకు ఆమోదం తెలుపుతూ జీవోలు జారీ చేశారు.

"విద్యార్థులందరికీ ఉచితంగా బస్సు పాసులు జారీ చేస్తాం" అని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. ప్రభుత్వానికి చెందిన నాన్-లగ్జరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సదుపాయం వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఒక ప్రైవేట్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను నెల రోజుల్లోగా ఖరారు చేస్తామన్నారు....