భారతదేశం, జూలై 6 -- ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు ఏయూ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. విద్యార్థుల నుండి వచ్చిన నిరంతర అభ్యర్థనలు, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న ప్రతిష్టాత్మక కోర్సులైన మూడేళ్ల బీబీఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీబీఏ-ఎంబీఏ (Integrated BBA-MBA) ప్రోగ్రాములలో చేరడానికి ఆఫ్‌లైన్ దరఖాస్తుల సమర్పణ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అర్హులైన అభ్యర్థులు ఇప్పుడు జూలై 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

ఈ మేరకు ఆంధ్ర యూనివర్సిటీ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ డి.ఎ. నాయుడు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన జాతీయ విద్యా విధానం - 2020 (NEP 2020) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కోర్సులు రూపుదిద్దుకున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కోర్సులలో వ...