భారతదేశం, అక్టోబర్ 14 -- తెలంగాణలో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే కలలు కంటున్న వెనకబడిన తరగతులు(బీసీ), ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈబీసీ) విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

2026 ఫాల్ సెషన్‌లో విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఈ పొడిగించిన గడువును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. అక్టోబర్ 15 నుంచి ప్రారంభమయ్యే ఈ దరఖాస్తు ప్రక్రియ, అక్టోబర్ 31, 2026 వరకు అందుబాటులో ఉంటుంది.

అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు లేక విదేశీ విద్యకు దూరమవుతున్న ప్రతిభావంతులైన బీసీ, ఈబీసీ విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ వంటి ప్రపంచ స్థాయ...