భారతదేశం, మే 7 -- తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా, మెజారిటీకి 118 సీట్లు అవసరం. ప్రస్తుతం విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పరిస్థితి ఇలా ఉంది:

టీవీకే గెలిచిన స్థానాలు: 108

కాంగ్రెస్ మద్దతు: 05

మొత్తం బలం: 113

కావాల్సిన అదనపు సీట్లు: 05

విజయ్ ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కోరారు. అయితే, స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో గవర్నర్ న్యాయ నిపుణుల సలహా కోరారు. ఈ లోపు రాజ్‌భవన్‌లో 'వెయిట్ అండ్ వాచ్' పర్వం నడుస్తోంది.

విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తాము ఆటంకాలు సృష్టించబోమని స్టాలిన్ స్పష్టం చేశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే:

"ప్రజలు ఎన్నుకున్న పార్టీగా టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు మేము వేచి చూస్తాం. కనీసం ఆరు నెలల పాటు వారిని ఇబ్బంది పెట్టకుండా గమనిస్తాం. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం...