భారతదేశం, మే 6 -- తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని దళపతి విజయ్ పూర్తిగా మార్చేశారు. ఆయన స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 108 స్థానాలు సాధించి అతిపెద్ద పక్షంగా అవతరించింది. అయితే, ఈ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో 'ఇండియా కూటమి'లో తీవ్ర చిచ్చు రేపాయి. నిన్నటి వరకు ఎన్నికల్లో డీఎంకేతో కలిసి నడిచిన కాంగ్రెస్ పార్టీ, అనూహ్యంగా ఇప్పుడు విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ప్రకటించింది. దశాబ్దాలుగా రాజకీయ మిత్రులుగా ఉన్న డీఎంకే-కాంగ్రెస్ మధ్య ఇప్పుడు మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 118 కి టీవీకే కేవలం 10 సీట్ల దూరంలో నిలిచింది. ఈ లోటును భర్తీ చేసేందుకు టీవీకే లాంఛనంగా కాంగ్రెస్ మద్దతు కోరింది. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు లౌక...