భారతదేశం, మే 9 -- తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వ ఏర్పాటుకు విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) బేషరతుగా మద్దతు ప్రకటించింది. ఈ పరిణామంతో విజయ్ ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమమైంది. శనివారం జరిగిన కీలక చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.
శనివారం వీసీకే పార్టీ మద్దతు ప్రకటించగా, వెంటనే మరో మిత్రపక్షమైన ఐయూఎంఎల్ (IUML) కూడా టీవీకేకు జై కొట్టింది. ఈ రెండు పార్టీల మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 సీట్ల కంటే రెండు సీట్లు అదనంగా విజయ్ ఖాతాలో చేరాయి.
టీవీకే నేత ఆధవ్ అర్జున మీడియాతో మాట్లాడుతూ.. వీసీకే తమకు మద్దతు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ త్వరలోనే ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆయన ధీమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.