భారతదేశం, మే 9 -- తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వ ఏర్పాటుకు విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) బేషరతుగా మద్దతు ప్రకటించింది. ఈ పరిణామంతో విజయ్ ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమమైంది. శనివారం జరిగిన కీలక చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.

విజయ్ ప్రమాణస్వీకారానికి డేట్ కూడా ఫిక్స్ అయింది. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి గవర్నర్ రాజేంద్ర అర్లెకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏప్రిల్ 10వ తేదీన మధ్యాహ్నం 3.15 గంటలకు చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేస్తారు. 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా సమాచారం.

శనివారం వీసీకే పార్టీ మద్దతు ప్రకటించగా, వెంటనే మరో మిత్రపక్షమైన ఐయూఎంఎల్ (IUML) కూడా టీవీకేకు జై కొట్టింది...