విజయవాడ ఆటోనగర్ బొమ్మల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. కోట్ల ఆస్తి నష్టం!
భారతదేశం, నవంబర్ 21 -- విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆటోనగర్ 3వ క్రాస్ రోడ్, రోడ్ నంబర్ 2లో ఉన్న ఒక ప్రముఖ బొమ్మల తయారీ పరిశ్రమలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో ప్లాస్టిక్, ఇతర మండే స్వభావం కలిగిన ముడిసరుకు భారీగా ఉండటంతో మంటలు క్షణాల్లోనే భవనం మొత్తానికి వ్యాపించాయి. దీంతో దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేయగా, స్థానిక పారిశ్రామికవేత్తలు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఉదయం పూట ఫ్యాక్టరీ నుండి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. అయితే లోపల పిల్లల బొమ్మల తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్, ప్యాకింగ్ మెటీరియల్, రంగులు, రసాయనాలు ఉండటంతో మంటలు అత్యంత వేగంగా ఎగిసిపడ్డాయి.
ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ భవనంలోని మొదటి, రెండో అంతస్తులు పూర్తిగా మంటలకు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.