విజయవాడలో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవదహనం!
భారతదేశం, అక్టోబర్ 12 -- విజయవాడ నగర శివారులోని వెస్ట్ బైపాస్ రోడ్డుపై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తీవ్ర వేగంతో వెళ్తున్న ఒక ఎలక్ట్రిక్ వాహనం అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రభావంతో కారులోని బ్యాటరీ వ్యవస్థలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు సజీవదహనం కాగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా నంబూరులో జరిగిన ఒక ఫంక్షన్‌కు హాజరై తిరుగు ప్రయాణమైన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు, అగ్నిమాపక రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ, అప్పటికే నలుగురు కాల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.