భారతదేశం, అక్టోబర్ 12 -- విజయవాడ నగర శివారులోని వెస్ట్ బైపాస్ రోడ్డుపై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తీవ్ర వేగంతో వెళ్తున్న ఒక ఎలక్ట్రిక్ వాహనం అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రభావంతో కారులోని బ్యాటరీ వ్యవస్థలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు సజీవదహనం కాగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా నంబూరులో జరిగిన ఒక ఫంక్షన్‌కు హాజరై తిరుగు ప్రయాణమైన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు, అగ్నిమాపక రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ, అప్పటికే నలుగురు కాల...