విజయవాడ, వరంగల్ మీదుగా భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్లు - షెడ్యూల్ వివరాలు ఇవే!
భారతదేశం, జూన్ 5 -- దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే ఆధ్యాత్మిక యాత్రికులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. విజయవాడ మీదుగా రెండు భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు వేర్వేరు తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ క్షేత్రాలను అనుసంధానిస్తూ ఈ సర్వీసులను ఆపరేట్ చేయనున్నట్లు అధికారులు వివరించారు.
తొలి భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 2.10 గంటలకు ఇందౌర్‌లో బయల్దేరుతుంది. ఆ తర్వాత వివిధ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తూ.. మరుసటి రోజు ఉదయం 7.15 గంటలకు బలార్షా చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి 11వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు విజయవాడకు.. అదే రోజు రాత్రి 11.00 గంటలకు రేణిగుంటకు చేరుకుంటుంది. ఈ రైలు ప్రయాణికులను తీసుకుని 14వ తేదీ ఉదయం 7.00 గంటలకు ప్రముఖ శైవక్షేత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.