భారతదేశం, జూన్ 5 -- దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే ఆధ్యాత్మిక యాత్రికులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. విజయవాడ మీదుగా రెండు భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు వేర్వేరు తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ క్షేత్రాలను అనుసంధానిస్తూ ఈ సర్వీసులను ఆపరేట్ చేయనున్నట్లు అధికారులు వివరించారు.

తొలి భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలు ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 2.10 గంటలకు ఇందౌర్‌లో బయల్దేరుతుంది. ఆ తర్వాత వివిధ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తూ.. మరుసటి రోజు ఉదయం 7.15 గంటలకు బలార్షా చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి 11వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు విజయవాడకు.. అదే రోజు రాత్రి 11.00 గంటలకు రేణిగుంటకు చేరుకుంటుంది. ఈ రైలు ప్రయాణికులను తీసుకుని 14వ తేదీ ఉదయం 7.00 గంటలకు ప్రముఖ శైవక్షేత...