భారతదేశం, జూలై 2 -- రోడ్డు ప్రమాదాల కేసుల్లో బాధితులకు లేదా వారి వారసులకు అందించే నష్టపరిహారం లెక్కింపు ప్రక్రియలో మరింత పారదర్శకత, ఏకరూపత తీసుకువచ్చేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. క్లెయిమ్ దారుడు జీతం పొందే ఉద్యోగి అయినా, స్వయం ఉపాధి పొందే ప్రొఫెషనల్ అయినా లేదా గతంలో ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు చేయని వారైనా.. వారి ఆదాయాన్ని ఎలా అంచనా వేయాలో కోర్టు స్పష్టత ఇచ్చింది.

గత ఐదేళ్లలో అత్యధికంగా ఉన్న ఐటీఆర్ (ITR) మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని హైకోర్టు ఒక కేసులో ప్రమాద పరిహారాన్ని ఖరారు చేసింది. దీనిని సవాలు చేస్తూ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది.

హైకోర్టు అనుసరించిన ఆ విధానాన్ని తప్పుబడుతూ.. ఏదో ఒక ఏడాదిలో వచ్చిన అత్యధ...