భారతదేశం, జూన్ 16 -- మీ వాహనానికి సంబంధించిన ట్రాఫిక్ ఉల్లంఘన ఈ-చలానాలు(E-Challan), ఇతర కీలక సమాచారాన్ని ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా నేరుగా సకాలంలో తెలుసుకోవడానికి రవాణా శాఖ కీలక సూచన చేసింది. వెంటనే వాహన్(VAHAN) పోర్టల్‌‌లో మీ ప్రస్తుత మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది.

చాలామంది వాహనం కొనుగోలు చేసినప్పుడు ఇచ్చిన పాత నంబర్లను మార్చకపోవడం వల్ల చలానాల సమాచారం అందడం లేదు. కాంటాక్ట్ వివరాలను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా, నోటిఫికేషన్లు అందకపోవడం వల్ల పడే భారీ జరిమానాల భారం నుంచి తప్పుకోవచ్చు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 'వాహన్' పోర్టల్‌లో నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీకి పంపిన చలానాలను వాహన యజమానికి అధికారికంగా చేరినట్లుగానే పరిగణిస్తారు. నాకు మెసేజ్ ర...