వారికి మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈ నెల 15న మీటింగ్
భారతదేశం, మే 13 -- ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్నీ కూటమి ప్రభుత్వం సహించదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రొయ్యల ఫీడ్ ధరలను ఒక్కసారిగా పెంచడం వల్ల రాష్ట్రంలోని వేలాది ఆక్వా రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాలు, అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందిస్తూ, రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రస్తుతం ఆక్వా రంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని, ఇలాంటి సమయంలో రైతులపై అదనపు భారం మోపే చర్యలు తీసుకుంటే ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలు కాపాడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.