భారతదేశం, అక్టోబర్ 12 -- వాట్సాప్‌లో వచ్చిన ఒకే ఒక్క సందేశానికి కేవలం 'NO' అని రిప్లై ఇచ్చినందుకే ఒకరి బ్యాంక్ ఖాతా క్షణాల్లో నిలువునా ఖాళీ అయిపోయింది. బాధితుడు ఎవరికీ ఎలాంటి ఓటీపీ చెప్పలేదు.. ఏ అనుమానాస్పద లింక్‌పైనా క్లిక్ చేయలేదు.. కేవలం 'NO' అనే రెండక్షరాల సమాధానమే జీవితకాల సంపాదనను తుడిచిపెట్టేసింది.

ఇటీవల ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ను సైతం నిలువునా ముంచేసిన ఈ సరికొత్త సైబర్ నేరం నా దృష్టికి వచ్చింది. సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు పన్నిన అత్యంత ప్రమాదకరమైన ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్ ఇది అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

ఈ మోసం ఎలా జరుగుతోందంటే.. మొదట గుర్తుతెలియని నంబర్ నుంచి మీ వాట్సాప్‌కు 'మీ ఖాతా నుంచి ఇంత మొత్తం డెబిట్ అయ్యింది అంటూ నకిలీ సందేశం వస్తుంది. ఆ వెంటనే మిమ్మల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తూ.. 'ఈ లావాద...