భారతదేశం, ఆగస్టు 26 -- డిజిటల్ యుగంలో వాట్సాప్ వాడకం ఎంత పెరిగిందో.. అదే స్థాయిలో సైబర్ నేరాలు, ఖాతాల హ్యాకింగ్ ఘటనలు తీవ్రమవుతున్నాయి. ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేస్తూ వినియోగదారుల ఖాతాలకు మరింత రక్షణ కల్పించేందుకు మెటా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. పిన్ నంబర్ల స్థానంలో ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్, ఒకే ఖాతాకు బహుళ పాస్‌కీలు, అపరిచిత కాల్స్ వివరాలు ముందే తెలిపే కాలర్ కాంటెక్స్ట్ వంటి అధునాతన సెక్యూరిటీ ఫీచర్లను వాట్సాప్ ఆవిష్కరించింది.

ఇప్పటివరకు వాట్సాప్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్ కోసం ఆరు అంకెల పిన్ (PIN) నంబర్‌ను మాత్రమే ఉపయోగించే వెసులుబాటు ఉండేది. అయితే చాలామంది '123456' లేదా పుట్టిన తేదీల వంటి సులువైన సంఖ్యలను ఎంచుకోవడం వల్ల సైబర్ నేరగాళ్లు సులభంగా ఖాతాలను హ్యాక్ చేసేవారని భద్రతా నిపుణులు హెచ్చరించేవారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, పి...