వర్షాలతో పంట నష్టం.. వెంటనే అంచనా వేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు
భారతదేశం, సెప్టెంబర్ 25 -- తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల నష్ట వివరాలను సేకరించి, అత్యవసర పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలు, జిల్లా యంత్రాంగం పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ఈ మేరకు వర్షాల ప్రభావం, తక్షణం చేపట్టాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బూడితి రాజశేఖర్, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖల ఉన్నతాధికారులు, అలాగే పార్వతీపురం మన్యం, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.