భారతదేశం, నవంబర్ 4 -- నవంబర్ 5న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, స్థానిక పరిస్థితులు, మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా. వర్షాల ప్రభావం, పోలింగ్ కేంద్రాల వద్ద నెలకొన్న పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, ఎన్నికల సిబ్బంది సంసిద్ధత తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. చాలా జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయని, పరిమిత సంఖ్యలో కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల పోలింగ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్లు నివేదించినట్లు వెల్లడించారు.

వాతావరణ పరిస్థితులు, స్థానికంగా నెలకొన్న పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లక...