భారతదేశం, నవంబర్ 9 -- గ్లోబల్ వర్క్‌స్పేస్ దిగ్గజం 'వీవర్క్' (WeWork) తన వ్యాపార వైఫల్యాల నుంచి పుంజుకుని మళ్లీ సరికొత్త పునాదులు వేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ సంస్కృతిని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు వీవర్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) జాన్ శాంటోరా పక్కా వ్యూహంతో ముందడుగు వేస్తున్నారు. ఆఫీసులో ప్రొఫెషనల్ వాతావరణం, ఉద్యోగులపై నమ్మకం అనే రెండు సూత్రాల కలయికతోనే కంపెనీని మళ్లీ లాభాల బాట పట్టించడం సాధ్యమవుతోందని ఆయన స్పష్టం చేశారు.

బిజినెస్ ఇన్‌సైడర్ నిర్వహించిన 'ది లాంగ్ ప్లే' సదస్సులో ఆయన మాట్లాడారు. 2024లో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఎదురైన ఓ ఆసక్తికరమైన సంఘటనను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒక వీవర్క్ ఆఫీస్‌ను సందర్శించినప్పుడు, అక్కడి ఉద్యోగులు పైజామాలు, స్లిప్పర్లు, షార్ట్‌లు వేసుకుని కనిపించారట.

ఆ ...