భారతదేశం, నవంబర్ 15 -- అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు సమీపంలోని వరాహ నదిలో స్నానానికి దిగి గల్లంతైన ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. ఆదివారం ఉదయం నదిలో తేలియాడుతున్న వారి మృతదేహాలను స్థానికులు, పోలీసులు కలిసి బయటకు వెలికితీశారు. అప్పటివరకు తమ బిడ్డలు క్షేమంగా తిరిగి వస్తారని ఆశగా ఎదురుచూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విగతజీవులుగా మారిన యువకులను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో పెనుగొల్లు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

శనివారం ఆరుగురు యువకులు సరదాగా స్నానం చేసేందుకు పెనుగొల్లు వద్ద ఉన్న వరాహ నదిలోకి దిగారు. అయితే నదిలో నీటి ప్రవాహం, లోతు అంచనా వేయలేక వారు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆరుగురిలో ముగ్గురు యువకులు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలిగారు. కానీ కాతేటి రిషి (18), మ...