భారతదేశం, జనవరి 27 -- వరంగల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్భిణిగా ఉన్న వైద్యురాలు మరణించింది. హంటర్ రోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలు మమతా రాణి పని చేస్తున్నారు. ఆమె కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి మండలం బాతంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. గత సంవత్సరం నారాయణపేటకు చెందిన వైద్యుడు రాఘవేంద్రతో వివాహం జరిగింది. ఇద్దరూ వరంగల్‌లో వైద్యులుగా పనిచేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దంపతులు డ్యూటీ ముగించుకుని సోమవారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుండి ఒక టిప్పర్ లారీ వారి బైక్‌ను ఢీకొట్టడంతో డాక్టర్ మమతాకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు, భర్త ఆమెను చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 9 నెలల గర్భంతో ఉన్న డాక్టర్ మమతా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. జార్ఖండ్‌కు చెందిన ట...