భారతదేశం, మార్చి 30 -- వట్టినాగులపల్లిలో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం పర్యటించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసింది. పొంగులేటి కుమారుడు భూములను కబ్జా చేశాడని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ. 1960 నుంచే ఇక్కడ సతీష్ షా కుటుంబానికి భూమి ఉందన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వారి పేరు మీదనే భూమి ఉందని తెలిపారు. వట్టినాగులపల్లి గ్రామం అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ భూముల విలువలు భారీగా పెరిగాయన్నారు. ఇలాంటి భూములపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నుపడిందని ఆరోపించారు.

"మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు హర్షా రెడ్డి కలిసి స్వయంగా సతీష్ షా ఇంటికి వెళ్లి, భూమిని డెవలప్‌మెంట్‌కు ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరించారు. అయితే సతీష్ షా కుటుంబం భూమిని డెవల...