భారతదేశం, అక్టోబర్ 1 -- రాబోయే వేసవి కాలంలో హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWS&SB) మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్‌తో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో వేసవి కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. సింగూర్-మంజీరా ప్రత్యామ్నాయ ప్రణాళికలు, విద్యుత్ బోర్‌వెళ్ల పునరుద్ధరణ, వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ల సామర్థ్యం, పారిశ్రామిక, బల్క్ నీటి సరఫరా, నెట్‌వర్క్ అనుసంధానత, శుద్ధి చేసిన నీటి మళ్లీ వినియోగం వంటి కీలక అంశాలను సమీక్షించారు.

సింగూర్, మంజీరా జలాలపై ఆధారపడే ప్రాంతాలను గుర్తించి, అత్యవసర సమయాల్లో ఇతర వనరుల నుంచి ప్ర...