భారతదేశం, సెప్టెంబర్ 9 -- సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే మూల మంత్రాలుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రతి వారమూ ప్రజల మధ్యలోనే ఉంటున్నానని వెల్లడించారు. రాష్ట్ర సచివాలయానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చేలా చేయటమే అసలైన సుపరిపాలన అని దానికి కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని అన్నారు.

కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పండువారిపేటలో నిర్వహించిన మీ భూమి- మీహక్కు గ్రామసభలో సీఎం పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ప్రతి నెలలోనూ వీలైనన్ని సార్లు ప్రజల మధ్యకు వచ్చి బాగోగులు తెలుసుకుంటున్నానని అన్నారు. ప్రతినెలా మొదటి తేదీనే పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందిస్తూ ప్రజల్ని కలుస్తూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటున్నానని అన్నారు. పీ4తో సామాజిక బాధ్యత కింద ప్రజల జీవన ప...