భారతదేశం, ఫిబ్రవరి 25 -- వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఆహార నాణ్యతపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులకు చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. తాజాగా ముంబైలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్యాంట్రీ కార్ ఏర్పాటుపై కీలక చర్చలు జరిగాయి. ప్రయాణికులకు వేడివేడి భోజనం అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారు.

వందే భారత్ స్లీపర్ రైలు.. భారతీయ రైల్వే గర్వకారణంగా చెప్పుకునే ఈ ఆధునిక రైలులో ప్రయాణం అంటేనే ఒక లగ్జరీ ఫీలింగ్. అయితే, ఇటీవల ప్రారంభమైన హౌరా - కామాఖ్య వందే భారత్ స్లీపర్ సర్వీసులో ప్రయాణికులకు ఒక చేదు అనుభవం ఎదురైంది. లగ్జరీ సౌకర్యాలు ఉన్నా, తినే భోజనం విషయంలో మాత్రం నాణ్యత లోపించిందని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన రైల్వే ఉన్నతాధికారులు, తాజాగా ముంబైలో ఒక అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

ప్రస్తుతం నడుస్త...