భారతదేశం, జూలై 8 -- మీలోని క్రియేటివిటీకి పదును పెట్టండి. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక గృహ నిర్మాణ పథకానికి అధికారిక లోగోను అందించే అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(CURE) పరిధిలో నిర్మించబోయే లక్ష ఎల్‌ఐజీ గృహ నిర్మాణ పథకం కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు ఒక లోగో డిజైన్ పోటీ ప్రకటించింది. ఉత్తమ లోగోను రూపొందించిన విజేతకు అక్షరాలా రూ. 1,00,000 నగదు బహుమతిగా అందించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ వెల్లడించారు.

ఈ డిజైన్ పోటీలో పాల్గొనడానికి కొన్ని విషయాలు డిజైనర్లు గుర్తుంచుకోవాలి. ముందుగా తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను (https://www.instagram.com/p/Dahnht3zFwE/) ఓపెన్ చేయాలి.

సదరు ఇన్‌స్టాగ్రామ్ బయో (Bio) లో అందుబాటులో ఉన్న గూగుల్ ఫామ్ లింక్‌పై క్లిక్ చేయాలి.

ఫామ్‌లో మీ ...