భారతదేశం, ఏప్రిల్ 17 -- మహిళా రిజర్వేషన్లు, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన కోసం ఉద్దేశించిన 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. ఓటింగ్‌కు హాజరైన 489 మంది సభ్యుల్లో 278 మంది సభ్యులు అనుకూలంగా, 211 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు. అయితే ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండో వంతు మంది సభ్యుల బలం అవసరం. ఈ లెక్కన 326 మంది సభ్యులు అనుకూలంగా ఓటేయ్యాలి. కానీ 278 మంది సభ్యులు మాత్రమే అనుకూలంగా ఓటేశారు.
ఈ బిల్లుపై ఉదయం నుంచి అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఎన్డీయే మిత్రపక్షాలన్నీ మద్దతు పలికాయి. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు పలికింది. అయితే ప్రతిపక్ష ఇండియా బ్లాక్ నుంచి అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. మహిళా రిజర్వేషన్లకు తాము అనుకూలమేనని, అయితే దీనిని డీలిమిటేషన్‌కు ముడిపెట్టడం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.