భారతదేశం, మే 27 -- హిందూమతంలో వారంలోని ప్రతి రోజుకు ఒక ప్రాముఖ్యత ఉంది. అలాగే గురువారం రోజుకు కూడా. ఈ పవిత్రమైన రోజున బ్రహస్పతి, విష్ణుమూర్తి, రాఘవేంద్ర స్వామి, సాయిబాబాలను భక్తిశ్రద్ధలతో పూజించే సంప్రదాయం ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతుంది. విష్ణుమూర్తిని పూజించే సంప్రదాయం కూడా ఉంది. గురువారం చేసే పూజలు, జపాలు, ఆచారాలతో దైవిక ఆశీర్వాదాలను, జ్ఞానాన్ని, వివేకాన్ని, సంపదను, విజయాన్ని అందిస్తాయని నమ్ముతారు.

ప్రతి వ్యక్తి జాతకంలో గురు గ్రహం మంచి స్థితిలో ఉండటం చాలా ముఖ్యం. జాతకంలో గురు గ్రహం మంచి స్థితిలో ఉన్న వ్యక్తి తాను చేసే అన్ని ప్రయత్నాలలో విజయం, శ్రేయస్సు, సంపదను పొందుతాడని నమ్ముతారు. గురువారం మీరు చేసే ఏ పనులు మీకు సంపద, శ్రేయస్సు మరియు విజయాన్ని తెచ్చిపెడతాయో చూద్దాం..

గురువారం రోజున అరటిపండ్లు, మామిడి పండ్లు, శనగలు దానం చేయాలి. ఇది కాక...