భారతదేశం, జూన్ 30 -- హైదరాబాద్ నగరంలో రోడ్లపైకి మురుగునీరు లేదా శుద్ధి చేసిన వ్యర్థ జలాలను వదిలిపెట్టే వారిపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్(HMWSSB) కఠిన చర్యలు ప్రారంభించింది. నిబంధనలను ఉల్లంఘించి, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా నీటిని రోడ్లపైకి వదిలిన జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 82 లోని ఒక ప్రైవేట్ వాణిజ్య సంస్థకు జలమండలి అధికారులు ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధించారు.

జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో జూన్ 26న జలమండలి అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సదరు కమర్షియల్ కాంప్లెక్స్ తమ సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నుండి వస్తున్న శుద్ధి చేసిన తర్వాత నీటిని నేరుగా బహిరంగ రహదారిపైకి వదులుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల రోడ్డుపై నీరు నిలిచిపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా, స్థానిక...